BRS MLA Lasya Nanditha : లాస్య రోడ్డు ప్రమాదం.. కీలక ఆధారాలు లభ్యం

by Rajesh |
BRS MLA Lasya Nanditha :  లాస్య రోడ్డు ప్రమాదం.. కీలక ఆధారాలు లభ్యం
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. పటాన్ చెరు ఓఆర్ఆర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురి కాగా ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. లాస్య కారును ఢీకొన్న టిప్పర్‌ను పోలీసులు తాజాగా గుర్తించారు. పోలీసులు సదరు టిప్పర్ లారీని సీజ్ చేశారు. యాక్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత టిప్పర్‌ను కర్ణాటకలో పోలీసులు గుర్తించారు.

పోలీసుల విచారణలో టిప్పర్ డ్రైవర్ కీలక విషయాలు వెల్లడించారు. అతి వేగంతో వచ్చిన ఎమ్మెల్యే కారు టిప్పర్ ను ఢీకొట్టడంతోనే యాక్సిడెంట్ జరిగిందని డ్రైవర్ తెలిపారు. మొదట కారు టిప్పర్ ను ఢీకొన్న తర్వాత వేగంగా వెళ్లి రెయిలింగ్ ను ఢీకొట్టిందని డ్రైవర్ వెల్లడించారు. లాస్య ప్రయాణిస్తున్న కారు వేగంగా టిప్పర్ ను ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. ఈ రోజు సాయంత్రం రంగారెడ్డి జిల్లా పోలీసులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కీలక విషయాలు వెల్లడించే చాన్స్ ఉంది.

Advertisement

Next Story

Most Viewed