ఎన్నికలు ఎప్పుడు వచ్చిన BRS సిద్ధమే: మంత్రి కొప్పుల కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
ఎన్నికలు ఎప్పుడు వచ్చిన BRS సిద్ధమే: మంత్రి కొప్పుల కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 115 మంది అభ్యర్థులతో మేము జాబితా విడుదల చేసుకోవడం మా ఎన్నికల సంసిద్ధతకు నిదర్శనమని అని స్పష్టం చేశారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని అన్నారు. జమిలీ ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్ధమే అని ప్రకటించారు. ఎన్నికలకు ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయని స్పష్టం చేశారు. కేంద్రానికి బీఆర్ఎస్ మద్దతు అనేది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీకి భయపడే కాంగ్రెస్ దళిత డిక్లరేషన్ ప్రకటించిందని ఆరోపించారు.

ఎన్నికలకు ముందు దళితులను, గిరిజనులను కాంగ్రెస్ డిక్లరేషన్ పేరిట మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మేందుకు దళిత గిరిజనులు అమాయకులు కారన్నారు. మల్లికార్జున్ ఖర్గే ఈ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను విడుదల చేయాల్సింది తెలంగాణలో కాదని.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రకటించాలని మంత్రి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ డిక్లరేషన్ ఎవ్వరూ నమ్మేలా లేదన్నారు. ఇన్నేళ్లు ఈ పథకాలు అమలు చేయాలని కాంగ్రెస్‌కు ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తమ పథకాలనే కాంగ్రెస్ కాపీ కొడుతోందని అన్నారు. తెలంగాణలో మళ్ళీ మేమే వస్తాం.. మరింత సమర్ధంగా పథకాలు అమలు చేస్తామని దీమా వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed