- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
Uttam Kumar Reddy: వరదలపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలపై బీఆర్ఎస్ సర్కార్ రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో సంభవించిన వరద నష్టంపై తెలంగాణ ప్రభుత్వం ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చిందని, దాని ప్రకారం మొత్తం వరద నష్టం రూ.10,300 కోట్లుగా అంచనా వేసిందని తెలిపారు. అలాగే వరద నష్టంపై కేంద్రానికి ఇప్పటికే నివేదికలు పంపిచామని, సమాధానం రావల్సి ఉందని చెప్పారు. అనంతరం బీఆర్ఎస్ ప్రకటించిన ప్రాజెక్టుల పాదయాత్ర కార్యక్రమం గురించి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రాజెక్టుల పాదయాత్రతో తమ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని, ఆ పార్టీ కంటే తమ ప్రభుత్వం గొప్పగా పనిచేస్తోందని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. తాము ముందుగా చెప్పినట్లే పాలమూరు ప్రాజెక్ట్‌ను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామన్న ఉత్తమ్.. కాంగ్రెస్‌కు డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదని, ప్రజలకు ఆదర్శపాలన అందించడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు.