పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.. డీజీపీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

by Disha Web Desk 9 |
పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.. డీజీపీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం, అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులపై రాష్ట్ర డీజీపీకి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. బుధవారం డీజీపీని కలిసి ఫిర్యాదును అందించారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలోనే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తిస్తోందని అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష బీఆర్ఎస్‌ను ఇబ్బందులకు గురిచేసే కార్యక్రమాల్ని ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలను, పనితీరు ప్రశ్నించిన వారిపై అసహనంతో ఊగిపోతోందన్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే సహించకలేకపోంది. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్ట్ లు పెడితే పోలీసులు అత్యుత్సాహంతో కేసులు పెడుతున్నారు. వారిని భయాంభ్రాంతులకు గురిచేస్తున్నారు. బైండవర్లు, కేసులు, ఫోన్లలో బెదిరింపులకు దిగుతూ బీఆర్ఎస్ కార్యకర్తల మనో ధైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే చాలు చట్టాన్ని కూడా లెక్క చేయకుండా కేసులు పెడుతున్నారు.

పోలీసు అధికారులు కూడా ప్రభుత్వానికి వంత పాడుతూ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై జులుం ప్రదర్శిస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. మా పార్టీకి చెందిన సల్వాజీ మాధవ రావు అనే ఉద్యమకారుడు కరీంనగర్ జిల్లా ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ మీద వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నాడని సొగాలి తిరుపతి అనే రౌడీ షీటర్ ద్వారా స్వయంగా ఎమ్మెల్యేనే హత్యాయత్నం చేయించాడని ఆరోపించారు. పైగా బాధితుడిపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అతన్నిమానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. పోలీసుల తీరుపై యావత్ తెలంగాణ సమాజం ఆగ్రహంగా ఉందన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే పోలీసులు ప్రజాస్వామ్యాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించే విధంగా పనిచేయాలని కోరారు.

Next Story

Most Viewed