రంగంలోకి గులాబీ బాస్.. వచ్చి రావడంతోనే బిగ్ స్కెచ్

by Disha Web Desk 13 |
రంగంలోకి గులాబీ బాస్.. వచ్చి రావడంతోనే బిగ్ స్కెచ్
X

దిశ, డైనమిక్ బ్యూరో:కాంగ్రెస్ ప్రభుత్వంపై గులాబీ బాస్, మాజీ సీఎం చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. గురువారం గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం హైదరాబాద్ నందినగర్ లోని తన నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులతో ప్రత్యేకంగా భేటీ అయిన కేసీఆర్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాశం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు గులాబీ క్యాంపస్ లో కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం దాంతో వారంతా పార్టీ మారబోతున్నరన్న చర్చ జోరందుకున్న వేళ నిన్నటి సమావేశంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారనే టాక్ వినిపిస్తోంది. ఈ భేటీలో భాగంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాదంటూనే ప్రభుత్వం ఉంటుందా? ఉండదా అనేది వారి చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారనే ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాధించలేదని ఇప్పటికే పార్టీలోని పలువురు సీనియర్లు వ్యాఖ్యానిస్తుండగా తాజాగా కేసీఆర్ సైతం అదే మాటను పార్టీ ఎమ్మెల్యేల వద్ద ప్రస్తావించారనే పొలిటికల్ కారిడార్ లో హాట్ టాపిక్ గా మారింది.

వలసలను ఆపేలా స్కెచ్:
రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోవడం, అంతలోనే కేసీఆర్ తుంటి ఎముక విరిగి బెడ్ రెస్ట్ కే పరిమితం కావడం ఆ తర్వాత పరిణామాలతో శ్రేణుల్లో కొంత గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెంచగా ఇదే సమయంలో బీఆర్ఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారనే ప్రచారంతో పార్టీ క్యాడర్ ను మరింత కన్ఫ్యూజన్ కు గురి చేసింది. దీంతో అనారోగ్యం బారి నుంచి కోలుకున్న కేసీఆర్ ఎవరూ అధైర్య పడవద్దని, మీ అందరికీ నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారని అందులో భాగంగానే కాంగ్రెస్ ట్రాప్ లో ఎవరూ పడవద్దంటూ వవలసలను ఆపేందుకు పక్కా స్కెచ్ వేశారనే టాక్ వినిపిస్తోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేస్తూనే సీఎంను మంచి ఉద్దేశంతోనే కలిసినా తప్పుడు సంకేతాలు వెళ్తాయని జరగబోయే డ్యామేజ్ ను పార్టీ నాయకలుకు వివరించే ప్రయత్నం చేశారు. సీఎంను పక్క పార్టీ ఎమ్మెల్యేలు కలవడం ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లే సంకేతాల ప్రభావం కేసీఆర్ కు తెలియనిది కాదని అందువల్లే ఈ విషయంలో పార్టీ ఎమ్మెల్యేలను అప్రమత్తం చేయాల్సి వచ్చిందనే చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, ఓటమి చెందినంత మాత్రాన ప్రజలకు దూరం కావాల్సిన అవసరం లేదని పార్టీలో మరోసారి ఉత్తేజం నింపేలా వ్యాఖ్యలు చేశారనే టాక్ వినిపిస్తోంది.

లోక్ సభలో సత్తా చాటేందుకు:
అసెంబ్లీ ఫలితాలనే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రిపీట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంటే బీఆర్ఎస్ అధినేత మాత్రం అసెంబ్లీ ఎన్నికల ప్రభావం లోక్ సభ ఎన్నికల్లోపడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గత ఎన్నికల్లో ఎక్కడ దెబ్బ తిన్నామో అనే అంశాలను బేరీజు వేసుకుని ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే జిల్లా పర్యటనలకు సైతం కేసీఆర్ సిద్ధం అవుతున్నారనే చర్చ గులాబీ పార్టీలో వినిపిస్తోంది. వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు దక్కించుకునేందుకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలునే ప్రధాన అస్త్రాలుగా చేసుకుని పార్లమెంట్ ఎన్నికల్లోకి వెళ్లేందుకే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆలోగా ఎవరూ కాంగ్రెస్ ట్రాప్ లో పడకుండా వ్యూహాత్మకంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. టైమ్ పాలిటిక్స్ లో చేయడంలో అక్స్ ఫర్ట్ అయిన కేసీఆర్ లోక్ సభ ఎన్నికల వేళ అనుసరిస్తున్న స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.

Next Story