BREAKING: విచారణ కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకోండి..: జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ సంచలన లేఖ

by Shiva |   ( Updated:2024-06-15 06:54:26.0  )
BREAKING: విచారణ కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకోండి..: జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ సంచలన లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్‌కు జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ గతంలో నోటీసు ఇచ్చింది. అయితే, రాత పూర్వక వివరణకు డెడ్‌లైన్ నేటితో ముగియనుంది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్‌కు లేఖ రాశారు. మొత్తం 12 పేజీలతో కూడిన కాపీ ప్రతి కమిషన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా లేఖలో ఆయన చాలా విషయాలను ప్రస్తావించారు. రాజకీయ కక్షతోనే దురుద్దేశపూర్వకంగా విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కమిషన్ విచారణ పారదర్శకంగా లేదని.. విచారణ పూర్తికాకుండానే ప్రెస్ మీట్ పెట్టారని ఆక్షేపించారు.

అక్కడ కూడా పదేళ్లు సీఎంగా పనిచేసిన తన పేరును పదేపదే ప్రస్తావించారని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ బిడ్డ అయిన చైర్మన్ జస్టిస్ నరసిహా‌రెడ్డి వ్యాఖ్యలు బాధ కలిగించాయని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ వ్యవహరించిందని, జూన్ 15 లోపే సమాధానం ఇవ్వాలని అనుకున్నానని, కానీ విచారణ నిష్పక్షపాతంగా లేదని అర్థమైందని తెలిపారు. కమిషన్ ఎదుట తాను హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు అనుకున్నానని కేసీఆర్ లేఖలో ప్రస్తావించారు. తమ ప్రభుత్వ హయాంలో కరెంట్ విషయంలో విప్లవాత్మక మార్పులను చేసి చూపించామని తెలిపారు.

ప్రజలకు 24 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్ అందజేశామని అన్నారు. రాష్ట్రంలో ఏర్పడక ముందు విద్యుత్ రంగం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అది జగమెరిగిన సత్యమని అన్నారు. కరెంట్ కోతలతో మోటార్లు కాలిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడే వారని వివరించారు. ఆ కాలంలో జనరేటర్లు, ఇన్వర్టర్ల కాలమే నడిచిందని తెలిపారు. ఎలక్ట్రిసిటీ యాక్ట్-2003 ప్రకారం న్యాయ ప్రతిపత్తి కలిగిన స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యూలేటరీ కమిషన్ తీర్పులకు లోబడే విద్యుత్ కొనుగోళ్లు చేశామని వివరించారు.

ఇక ఛత్తీస్‌ఘడ్ నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలు కరెంట్ కొనుగోలు చేయడంపై నాటి టీడీపీ ఎమ్మెల్సే తెలంగాణ ఈఆర్‌సీకి అభ్యతరాలు తెలిపారని గుర్తు చేశారు. ఆయన చేసిన ఆక్షేపణలు పరిశీలించి, పరిగణలోకి తీసుకున్న తరువాతే తెలంగాణ విద్యుత్ సంస్థలు చేసిన ప్రతిపాదనలకు ఈఆర్‌సీ ఆమోద్ర ముద్ర వేసిందని తెలిపారు. ఒకవేళ ఈఆర్‌సీ నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రైబ్యునల్‌కు వెళ్లొచ్చని, లేకపోతే దేశ అత్యన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు వెళ్లే స్వేచ్ఛను చట్టం రేవంత్‌‌రెడ్డికి కల్పించదని లేఖలో పేర్కొన్నారు. అయితే, లేఖ చివర్లో ‘ఎక్వయిరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా నరసింహారెడ్డికి కేసీఆర్ సూచించడం హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed