బ్రేకింగ్ : చికోటి ప్రవీణ్‌కు మరోసారి ఈడీ నోటీసులు

by Disha Web Desk 4 |
బ్రేకింగ్ : చికోటి ప్రవీణ్‌కు మరోసారి ఈడీ నోటీసులు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కుమార్‌కు ఈడీ అధికారులు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసారు. అతనితో పాటు మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మాధవ రెడ్డి, సంపత్‌లకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. థాయిలాండ్ దేశం పటాయాలోని ఓ లగ్జరీ హోటల్‌లో గ్యాంబ్లింగ్ నడుస్తున్నట్టు తెలిసి అక్కడి పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో గ్యాంబ్లింగ్ ఆడుతున్న 83 మంది భారతీయులతో పాటు థాయిలాండ్, మాయన్మార్ దేశానికి చెందిన వారిని అరెస్ట్ చేసారు. వీరిలో చీకోటి ప్రవీణ్ కుమార్, దేవేందర్ రెడ్డి, మాధవ రెడ్డి తదితరులు ఉన్నారు.

పటాయా పోలీసులు జరిపిన తనిఖీల్లో అయిదు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్యాంబ్లింగ్ జరిగినట్టు నిర్ధారణ అయ్యింది. ఈ లావాదేవీలకు సంబంధించిన లాగ్ బుక్‌ను పటాయా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, పటాయా పోలీసులకు అరెస్ట్ చేసిన భారతీయుల వద్ద కేవలం రూ. లక్షా 60 వేల ఇండియన్ కరెన్సీ మాత్రమే దొరికింది. ఈ నేపథ్యంలో పటాయా వెళ్లే ముందే అక్కడికి వెళ్లిన వారు డబ్బును ఇక్కడే డిపాజిట్లు చేసి వెళ్లినట్టు అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

ఈ క్రమంలో ఓడిపోయిన వారు డిపాజిట్ చేసిన మొత్తంలో నుంచి గెలిచిన వారికి ఇక్కడే చెల్లింపులు జరిగినట్టు తెలిసింది. ఇదంతా హవాలా మార్గంలోనే జరిగినట్టు అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు గతంలో చీకోటి ప్రవీణ్ కుమార్ తదితరులపై నమోదైన పీఎంఎల్ఏ కేసులో నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. పాత కేసులో నోటీసులు ఇచ్చినా పటాయా గ్యాంబ్లింగ్ గురించి ప్రశ్నించునున్నట్టు తెలిసింది. ఈనెల 12న చీకోటి హైదరాబాద్ రానున్నట్టు సమాచారం.

Next Story