BREAKING: నగరవాసులకు బిగ్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, ఆల్టర్‌నేట్ రూట్లు ఇవే

by Disha Web Desk 1 |
BREAKING: నగరవాసులకు బిగ్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, ఆల్టర్‌నేట్ రూట్లు ఇవే
X

దిశ, వెబ్‌డెస్క్: నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన చేశారు. రేపు రంజాన్ పర్వదినం సదర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో టాఫ్రిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మీర్ ఆలం ఈద్గా, మాసబ్ ట్యాంక్ పరిధిలోని హాకీ గ్రౌండ్స్‌లో ఈదుల్ ఫితర్ ప్రార్థన ఉన్న నేపథ్యంలో రేపు ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. మీర్ ఆలం ఈద్గా వద్ద పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు ప్రార్థనల్లో పాల్గొననుంటడంతో వాహనాల రాకపోకలను ఏమాత్రం అనుమతించరు.

అందుకు ప్రత్యామ్నాయంగా వాహనదారులు బహదూర్ పురా చౌరస్తా వద్ద కిషన్ బాగ్, కామాటిపురా, పురానాపూల్ వైపు వెళ్లవచ్చు. ఇక ఈద్గా వైపు వెళ్లే వాహనాలను శాస్త్రిపురం, ఎన్ఎస్ కుంట తదితర ప్రాంతాల వైపు ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ఇక కాలాపత్తర్ వద్ద మోచి కాలనీ, బహదూర్ పురా, షంషీర్ గంజ్, నవాబ్ సాహెబ్ కుంట వైపు మళ్లిస్తారు. అదేవిధంగా పురానాపూల్ నుంచి బహదూర్ పురా వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను జియాగూడ వైపు, రాజేంద్రనగర్ నుంచి బహదూర్పురా వైపు వెళ్లే భారీ వాహనాలను ఆరాంఘర్ జంక్షన్ వద్ద శంషాబాద్ లేదా రాజేంద్రనగర్ లేదా మైలార్ దేవపల్లి వైపు మళ్లిస్తారు.

ఇక హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ జంక్షన్ ఫ్లైఓవర్ కింద రంజాన్ ప్రార్థనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ కింద వాహనాల రాకపోకలను అనుమతించరు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు మెహిదీపట్నం, లక్డీకాపూల్ వైపు నుంచి ఫ్లైఓవర్‌పై మాత్రమే రాకపోకలు సాగించవచ్చు. బంజారాహిల్స్ రోడ్ నెం.12 నుంచి మాసబ్ ట్యాంక్ వైపు వచ్చే వాహనాలను రోడ్ నంబర్ 1, 12 జంక్షన్ నుంచి తాజ్ కృష్ణ హోటల్, ఆర్టీఏ ఖైరతాబాద్ వైపు మళ్లిస్తారు. అదేవిధంగా పంజాగుట్ట నుంచి తాజ్ కృష్ణ హోటల్ నుంచి ఎర్రం మంజిల్ కాలనీ, ఆర్టీఏ ఖైరతాబాద్, నిరంకరి, లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్, మెహిదీపట్నం వైపు వాహనాలను మళ్లించనున్నారు.

Next Story