BREAKING: డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం.. గచ్చిబౌలి పోలీసుల అదుపులో డైరెక్టర్ క్రిష్

by Disha Web Desk 1 |
BREAKING: డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం.. గచ్చిబౌలి పోలీసుల అదుపులో డైరెక్టర్ క్రిష్
X

దిశ, వెబ్‌డెస్క్: గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఏ-10 నిందితుడిగా డైరెక్టర్ క్రిష్ ముంబైలో ఉన్నట్లు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించారు. దీంతో పరారీలో ఉన్న ఏడుగురి పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ క్రిష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేడు గచ్చిచౌలి పోలీస్ స్టేషన్‌కు క్రిష్‌ను తీసుకువెళ్లనున్నారు. అనంతరం కేసుకు సంబంధించి క్రిష్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ క్రిష్ హైకోర్టును ఆశ్రయించారు. డ్రగ్స్ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్‌ దాఖలు చేసుకున్నారు.

కాగా, ఈ కేసులో సయ్యద్ అబ్బాస్ అలీ జాఫరీ వాంగ్మూలం‌ మేరకు.. రాడిసన్ హోటల్ యజమాని కుమారుడు వివేకానంద ఈ నెల 24న మధ్యాహ్నం నుంచి తన స్నేహితులు రఘు చరణ్, సందీప్, శ్వేత, లిషి, నీల్, నిర్భయ్, క్రిష్, సలగంశెట్టి‌తో కలిసి అర్ధరాత్రి 12 గంటల వరకు పార్టీ నిర్వహించాడని తేలింది. పార్టీలో 3 గ్రాముల కోకైన్‌ను వారు తీసుకున్నట్లుగా నిందుతుడు సయ్యద్ అబ్బాస్ అలీ జాఫరీ ఇచ్చిన వాంగ్మూలం‌లో బట్టబయలు అయినట్లు పోలీసులు కోర్టుకు విన్నవించారు. అందుకు సంబంధించి ఫోన్‌పే లావాదేవీలను సేకరించనట్లుగా పోలీసులు వెల్లడించారు. అబ్బాస్ గ్రాము కోకైన్‌ను మిరజా వాహేద్ నుంచి కొనుగోలు చేశాడని, అందుకు గ్రాము కొకైన్‌కు రూ.14 వేలు వివేకానంద తన డ్రైవర్ ప్రవీణ్ ద్వారా చెల్లించినట్లుగా అబ్బాస్ తెలిపాడు. వివేకానంద గతేడాది నంచి మద్యం సేవిస్తున్నాడని, కోకైన్ పార్టీలను నిర్వహిస్తున్నాడని కూడా పేర్కొన్నాడు.


Next Story

Most Viewed