చేవేళ్ల సభలో అమిత్ షా చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు: వినోద్ కుమార్ ఫైర్

by Disha Web Desk 19 |
చేవేళ్ల సభలో అమిత్ షా చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు: వినోద్ కుమార్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేవెళ్ల సభలో అన్ని అబద్దాలు చెప్పారని, తెలంగాణ ప్రజలకు షా క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఎంత మోసం చేస్తుందో బీజేపీ రాష్ట్ర నాయకులకు ఎందుకు కనిపించడం లేదన్నారు.

ఆదాయ లెక్కలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, బండి సంజయ్‌కి పంపిస్తానని కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలని సూచించారు. బీజేపీకి మతాల మధ్య చిచ్చు పెట్టె పని తప్ప ఇతర ఏ పని లేదని మండిపడ్డారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో కానీ, ఏ రాష్ట్రంలో అయిన ఉందా.. ఉంటే చూపాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి సవాల్ చేశారు.

ఫలానా రాష్ట్రం బాగుందని చూపిస్తా అంటే వస్తానని పేర్కొన్నారు. రాజకీయాలు వేరు అభివృద్ధి వేరని, ఎన్నికల్లో గెలుపోటములు సహజం అన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అన్న విషయాన్ని మరువద్దని సూచించారు. తక్కువ సమయంలోతెలంగాణ అభివృద్ధి జరిగిందని అది గమనించాలని సూచించారు. ఇతర దేశాలు, రాష్ట్రాల వారు హైదరాబాద్‌కి వచ్చి సింగపూర్‌కి వచ్చామా.. అని ఆశ్చర్య పోతున్నారన్నారు. రోడ్ సెస్ కింద తెలంగాణ రాష్ట్రం రూ.39,189 కోట్లు కేంద్రానికి చెల్లించిందని, కానీ కేంద్రం మాత్రం రాష్ట్రానికి చెందిన రోడ్లకు రూ. 34 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా రూ.5 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు.

రాష్ట్రానికి వివిధ గ్రాంట్ల కింద రూ. లక్షా20 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని అమిత్ షా చేవెళ్ల సభలో చెప్పారని, అందులో నాలుగో వంతు నిధులు కూడా ఇవ్వలేదన్నారు. 2014-15 లో రాష్ట్రానికి రూ. 30 వేల కోట్లు ఇచ్చినట్లు అమిత్ షా చెప్పారని, వాస్తవానికి రూ.15,307 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందని అన్నారు. చేవెళ్ల సభలో అమిత్ షా పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసే లెక్కలను అమిత్ షా వెంటనే సరి చేసుకోవాలని సూచించారు. గణాంక లెక్కలపై అమిత్ షా, బీజేపీ నేతలు చర్చకు రండి.. మీ లెక్కలు తప్పు అని నిరూపిస్తానని స్పష్టం చేశారు. విజయ సంకల్ప సభలో అమిత్ షా వచ్చిన సందర్భంలో ఏమైనా నిధులు ఇస్తారేమో అనుకున్నామని, కానీ ఏమీ లేదన్నారు.

ఎవరు ఎలా చనిపోయినా రాష్ట్రంలో రైతు బీమా ఇస్తున్నామని, ఆ లెక్కలు తీసుకుని రైతు ఆత్మహత్యలుగా బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదని సూచించారు. అమిత్ షా.. మీరు ఎవరో రాసిస్తే చదవవద్దు.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, సెస్ తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము అన్నారు. జాతీయ రహదారులు కావాలని విభజన చట్టంలో ఉందని, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కు అన్నారు.

కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలి, ఎన్టీపీసీలో విద్యుత్ కేంద్రం పెట్టాలి, బయ్యారం ఉక్కు కర్మాగారం పెట్టాలని విభజన హామీలో భాగంగా ఆనాటి యూపీఏ ప్రభుత్వం పొందుపర్చిందని, కానీ కేంద్రం నుంచి అవీ ఏవీ ఇప్పటికీ రాష్ట్రానికి ఏ ఒక్కటి రాలేదన్నారు. వాస్తవాలివిగో.. మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ అని వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాజారాం యాదవ్, గొట్టిముక్కల వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.



Next Story

Most Viewed