బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో బోణీ కొట్టిన బీజేపీ

by Disha Web Desk 19 |
బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో బోణీ కొట్టిన బీజేపీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఎట్టకేలకు బీజేపీ బోణీ కొట్టింది. నిర్మల్ అసెంబ్లీ స్థానం నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఘన విజయం సాధించారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న ఆయన ఇటీవల బీజేపీలో చేరారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్, కాంగ్రెస్ అభ్యర్థి కూచడి శ్రీహరి రావుపై విజయం సాధించారు. ఇదిలా ఉండగా దుబ్బాక సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ చేజార్చుకుంది. రఘునందన్ రావు ఓటమి చవిచూశారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. వేములవాడ బీజేపీ అభ్యర్థి వికాస్ రావు ఓడిపోయారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు ఓడిపోవడం గమనార్హం. ఈ స్థానాన్ని తొలుత తుల ఉమకు కేటాయించి అనూహ్యంగా బీఫామ్ వికాస్ రావుకు అందించారు. అయినా ఓటమి పాలవడం గమనార్హం. వేములవాడ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ గెలుపొందారు.

Next Story

Most Viewed