Delhi: తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వలేదు: కిషన్ రెడ్డి

by Disha Web Desk 16 |
Delhi: తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వలేదు: కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: 2014లో తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. తుక్కుగూడ కాంగ్రెస్ సభలో ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆయన కౌంటర్ ఇచ్చారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీని దంచి తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చాలా హామీలను నెరవేర్చలేదన్నారు. ‘కాంగ్రెస్ చెబుతున్న పథకాలు అమలు కాని పరిస్థితి ఉంది. పథకాల పేరుతో ప్రజలను మాయ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీది కుంభకోణాల చరిత్ర. కాంగ్రెస్ నేతలకు దోచుకోవడం, దాచుకోవడమే తెలుసు’ అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed