ఎన్టీఆర్ ​ఘాట్ ​కూల్చివేతకు మజ్లిస్​కుట్ర: బండి సంజయ్

by Disha Web |
ఎన్టీఆర్ ​ఘాట్ ​కూల్చివేతకు మజ్లిస్​కుట్ర: బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గతంలో ఎన్టీఆర్​ఘాట్‌ను కూల్చాలని మజ్లిస్ వంటి కుహానా శక్తులు కుట్ర చేశాయని, రూ.2 కే కిలో బియ్యం అందించిన ఘనత ఎన్టీఆర్‌ది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కొనియాడారు. ఎన్టీఆర్​జయంతి సందర్భంగా ఆయనకు బండి సంజయ్​నివాళులర్పించారు. రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేసి 80వ దశకంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలనే మలుపు తిప్పిన నాయకుడు ఎన్టీఆర్ అని కితాబిచ్చారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూ.2కే కిలోబియ్యం వంటి సంక్షేమ పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయంటే పేదల సంక్షేమం కోసం ఆయన ఎంతగా పరితపించారో అర్ధం చేసుకోవచ్చన్నారు. ఎన్టీఆర్ ఘాట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిప ఉందని ఆయన వెల్లడించారు.

Next Story