రాహుల్ గాంధీని చూస్తే గజిని గుర్తుకొస్తున్నాడు.. లోక్ సభలో ఎంపీ బండి సంజయ్

by Dishafeatures2 |
రాహుల్ గాంధీని చూస్తే గజిని గుర్తుకొస్తున్నాడు.. లోక్ సభలో ఎంపీ బండి సంజయ్
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని చూస్తే గజిని గుర్తుకొస్తున్నాడని అన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎందుకు ప్రవేశపెట్టారో వాళ్లకు కూడా ఐడియా లేదని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ వ్యవహార శైలి చూశాక ప్రపంచమంతా నవ్వుతోందని అన్నారు. ‘‘ ఒకసారి ముద్దులు పెడ్తడు.. ఇంకోసారి ఫ్లయింగ్ కిస్సులు పెడ్తడు.. ఒకసారి కౌగిలించుకుంటడు.. మరోసారి కన్నుగొడ్తడు. ఆయన వ్యవహారం చూస్తుంటే గజిని గుర్తుకొస్తున్నాడు’’ అని రాహుల్ ను విమర్శించారు.

రాహుల్ గాంధీ భారత మాత హత్య జరిగిందంటూ ఏదేదో మాట్లాడుతున్నారని, భారతమాతను హత్య చేసే ధైర్యం ఎవరు చేసిన తమ ప్రభుత్వం ఊరుకోదని అన్నారు. భారతమాతను వైపు కన్నెత్తి ఇంటోడు చూసినా.. బయటోడు చూసినా ప్రధాని మోడీ ఊరుకోరని అన్నారు. దేశంలో ప్రజల విశ్వాసం కోల్పోయిన నాయకులు నేడు అవిశ్వాసం పెట్టడం విడ్డూరంగ ఉందన్నారు.

Next Story