కేసీఆర్‌ను ఇంటికి పంపే రోజుల దగ్గర పడ్డాయ్: తరుణ్ చుగ్ ఫైర్

by Disha Web Desk 19 |
కేసీఆర్‌ను ఇంటికి పంపే రోజుల దగ్గర పడ్డాయ్: తరుణ్ చుగ్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి మహిళలు, వెనుకబడిన ప్రజలను దోపిడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే లాఠీ ఛార్జ్ చేయించి జైలులో పెట్టిస్తారని ఆరోపించారు. కేసీఆర్ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి రాజ్యాంగంపై నమ్మకం లేదని.. ఎన్నికల కమిషన్‌పై కూడా ప్రశ్నలు లేవనెత్తుతారని అన్నారు. కేసీఆర్‌ను ప్రజలు ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయన్నారు.

Also Read...

తెలంగాణ మంత్రులందరి అధికారులు ఆయన ఒక్కడి చేతిలోనే: ఇందిరా శోభన్ ఫైర్

Read Disha E-paper

Next Story