కాంగ్రెస్ నేతల అవినీతిని కచ్చితంగా బయటపెడుతా.. లీగల్ నోటీసులపై ప్రభాకర్ రియాక్షన్

by Disha Web Desk 2 |
కాంగ్రెస్ నేతల అవినీతిని కచ్చితంగా బయటపెడుతా.. లీగల్ నోటీసులపై ప్రభాకర్ రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేతల అవినీతి కచ్చితంగా బయట పెడతానని తెలంగాణ బీజేపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ సీరియస్ కామెంట్స్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో సూట్‌కేసులు, కార్లు గిఫ్ట్ ఇవ్వడాలు కామన్ అని అన్నారు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని.. అందితే సరైన సమాధానం చెప్తా అని స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే ప్రచారం చేస్తున్నారు.. ప్రచారం చేయడం కాదని ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. లేకపోతే మీరు కూడా లీగల్ నోటీసులు అందుకుంటారని హెచ్చరించారు.

కాంగ్రెస్ ఇన్‌చార్జులను ఎందుకు తొలగించారో ఆ పార్టీ ముఖ్య నేతలు సమాధానం చెప్పాలని అడిగారు. కాగా, ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుల నుంచి బెంజ్‌ కారు లబ్ధి పొందినట్లు ప్రభాకర్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై స్పందించిన మున్షీ.. తనపై చేసిన ఆరోపణలపై రెండు రోజుల్లో ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రూ.10 కోట్లు పరువు నష్టం దావా వేస్తానని ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ను మున్షీ హెచ్చరించారు. ఈ క్రమంలోనే తనపై చేసిన ఆరోపణలపై దీపాదాస్‌ మున్షీ లీగల్‌ నోటీసులు పంపారు. తాజాగా లీగల్ నోటీసులపై స్పందించిన ప్రభాకర్ పై వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed