'తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే ఫైట్'

by Disha Web Desk 2 |
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే ఫైట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే ఫైట్ ఉంటుందని బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. పార్టీలో చేరిన అనంతరం ఆయన తొలిసారి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానించారు. అనంతరం మర్రి శశిధర్ మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటి వరకు పరిస్థితులను చూస్తుంటే చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన కుటుంబానికి తెలంగాణతో అవినాభావ సంబంధం ఉందన్నారు. 1956లో తన తండ్రి మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని పోరాడిన వ్యక్తి అని గుర్తుచేశారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఇబ్బందులకు పడుతున్నారని, అలాంటి వారికి తామున్నామనే భరోసానిచ్చిన పార్టీ బీజేపీ మాత్రమేనని తెలిపారు. బీజేపీకి తెలంగాణ ప్రజలు ఫస్ట్ అని, గవర్నెన్స్, అందరికీ న్యాయం చేయడం ఫస్ట్ అని చెప్పారు.

అదే టీఆర్ఎస్‌కు ఫ్యామిలీ ఫస్ట్ అని, ఫామ్ హౌజ్, డాటర్, సన్ మాత్రమే ఫస్ట్ అని విమర్శలు చేశారు. పార్టీ అధికారంలోకి రావాలంటే నాయకత్వంపై నమ్మకం ఉండాలని, ప్రధాని నరేంద్రమోడీపై అందరికీ నమ్మకముందన్నారు. టీఆర్ఎస్ నేతలు ప్రజల విశ్వాసం కోల్పోయారని ఫైరయ్యారు. కాంగ్రెస్ నాయకులు ప్రజల సమస్యలను గాలికి వదిలేశారన్నారు. ఇవన్నీ తానేదో బీజేపీలో చేరానని చెప్పడం లేదని, నిజాలని వెల్లడించారు. టీఆర్ఎస్ పాపులారిటీ రోజురోజుకూ తగ్గుతోందని, వ్యతిరేకత భారీగా పెరుగుతోందని విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో దోచుకుందని ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్యాయం బీజేపీయేనని తెలిసి కేంద్రంపై అభాండాలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ ఆలోచనలు చూస్తే మహ్మద్ బిన్ తుగ్లక్ కనిపిస్తున్నాడని, తుగ్లక్ ఆత్మ ఇక్కడే ఉన్నట్లుందని ఎద్దేవాచేశారు.

Read more:

CM కూతురైనా.. ఢిల్లీ మంత్రి అయినా వదిలేది లేదు: MP లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు


Next Story

Most Viewed