- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- ఉగాది రాశి ఫలాలు
- Job Notifications
కేసీఆర్‌కు టీచర్లపై ఏమాత్రం ప్రేమ లేదు: Bandi Sanjay

దిశ, వెబ్‌డెస్క్: ఇందిరాపార్క్ వద్ద ఈనెల 30న బీజేపీ చేపట్టబోయే ధర్నాకు భయపడే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్లతోపాటు స్పౌజ్ బదిలీలకు అనుమతించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇది ఉపాధ్యాయులు, బీజేపీ కార్యకర్తల పోరాట విజయం. ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుల కోసం బీజేపీ ఎంత దూరమైనా వెళుతుందని భరోసా కల్పించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చారు. ''వాస్తవానికి కేసీఆర్‌కు టీచర్లపై ఏమాత్రం ప్రేమ లేదు. నిజంగా ఉద్యోగ, ఉపాధ్యాయులపై ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే కొత్త పీఆర్సీని అమలు చేసేవారు. 317 జీవో ద్వారా స్థానికత కోల్పోయిన ఉద్యోగులకు న్యాయం చేసేవారు. ప్రతి నెలా ఠంచన్‌గా ఒకటో తేదీనే జీతాలు విడుదల చేసేవారు. టీచర్స్ MLC ఎన్నికలతోపాటు సాధారణ ఎన్నికలు వస్తుండటంతో ఓట్ల కోసం కేసీఆర్ చేసిన జిమ్మిక్కులో భాగమే తప్ప, ఉపాధ్యాయులపై ప్రేమ లేదు. ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధన విషయంలో బీజేపీ వారికి పూర్తి అండగా నిలుస్తుంది, సమస్యలు పరిష్కారమయ్యే వరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తూనే ఉంటాము.'' అని బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా ఉపాధ్యాయ సంఘాలకు భరోసా ఇచ్చారు.
Also Read...