ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల్లో పాగా వేసేందుకు బీజేపీ స్కెచ్

by Javid Pasha |
ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల్లో పాగా వేసేందుకు బీజేపీ స్కెచ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : గిరిజన అసెంబ్లీ స్థానాలపై బీజేపీ దృష్టిసారిస్తోంది. 12 స్థానాల్లో గెలుపు పంజా వేయాలని ప్లాన్ చేస్తోంది. ఎస్టీ నియోజకవర్గాల్లో బలోపేతంపై కమలదళం కసరత్తులు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుని ఓటర్లకు దగ్గరయ్యే పనిలో కమలనాథులు ప్రణాళికలు రచిస్తున్నారు. రిజర్వేషన్ల అంశంతో పాటు పోడు సమస్యపై తెలంగాణ సర్కార్ ఎలాంటి పరిష్కారం చూపలేకపోయింది. ఈ అంశాలతో పాటు స్థానిక సమస్యలను గుర్తించి వాటిపై పోరాటం చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ సర్కార్ కు చెక్ పెట్టాలని కమలనాథులు డిసైడయ్యారు. గిరిజనుల్లో చైతన్యం కల్పించి వారిని తమ వైపునకు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం ఎస్టీ రిజర్వ్‌డ్ అసెంబ్లీ స్థానాలకు చెందిన నేతలతో ములుగులో సమావేశాన్ని నిర్వహించనున్నారు. కాగా ఈ మీటింగ్ ఈ నెలాఖరులో నిర్వహిస్తారని చెపపినప్పటికీ ఇతర కార్యకలాపాల వల్ల వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో గిరిజన రిజర్వ్‌డ్ అసెంబ్లీ స్థానాలు 12 ఉన్నాయి. త్వరలో అన్ని సెగ్మెంట్లకు చెందిన నేతలతో రాష్ట్ర నాయకత్వం భేటీ కానుంది. మిషన్ 12 అనే పేరుతో త్వరలో ఈ సమావేశాన్ని నిర్వహించనుంది. ములుగులో ఈ మీటింగ్ ను నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ తరుణ్ చుగ్ హాజరుకానున్నారు. గిరిజన నేతలతో భేటీ అయి వారికి పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ములుగు జిల్లా గిరిజన ప్రాంతం. చాలా తెగలకు చెందిన ప్రజలు అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. అందుకే ఈ సమావేశాన్ని అక్కడ నిర్వహిస్తే ప్రభావితం చేయొచ్చని కమలనాథులు భావిస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలైన 31 సెగ్మెంట్లపై దృష్టిసారించిన బీజేపీ ఎస్సీ, ఎస్టీ కేటగిరీలుగా విభజించాయి. ఎస్టీ నియోజకవర్గాలకు ఇన్ చార్జీగా మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావుకు బాధ్యతను అప్పగించింది. ఎస్సీ నియోజకవర్గాల ఇన్ చార్జీగా మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డికి రాష్ట్ర నాయకత్వం బాధ్యతలు అప్పగించింది. ములుగులో తరుణ్ చుగ్ ముఖ్య అతిథిగా త్వరలో నిర్వహించబోయే సమావేశాన్ని సక్సెస్ చేయడంపై గరికపాటి దృష్టిసారిస్తున్నారు. ఇదిలాఉండగా ములుగునే ప్రత్యేకంగా ఎంచుకోవడంపైనా పలు కారణాలు ఉన్నాయని శ్రేణులు చెబుతున్నాయి. ములుగులో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ కు అనుకున్న దానికంటే భారీగా ప్రజల నుంచి ఆదరణ దక్కినట్లుగా చెబుతున్నారు. అక్కడున్న ముఖ్య నేతలు పని విభజన చేసుకుని సక్సెస్ చేశారని, అదే ఐకమత్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా చాటాలని చాటి చెప్పేందుకే ఈ సమావేశాన్ని ములుగులో నిర్వహించేందుకు ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. అందుకే ఈ ప్రాంతాన్ని ఒక మోడల్ గా తీసుకుని ఇక్కడి నుంచే ప్రభుత్వంపై సమరశంఖం పూరించాలని కాషాయదళం ప్లాన్ చేస్తోంది. ములుగులో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ సక్సెస్ పైనా వచ్చే నేతలకు వివరించనున్నారు. మరి బీజేపీ వ్యూహం వర్కవుట్ అవుతుందా? లేదా అనేది చూడాల్సిందే.

Next Story

Most Viewed