రాష్ట్రంలో బీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం..

by Disha Web Desk 11 |
రాష్ట్రంలో బీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం..
X

దిశ, అంబర్ పేట్: తెలంగాణ రాష్ట్రంలో దళితులు, ఓబీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు బీఆర్ఎస్ పాలన పట్ల విసిగిపోయి ఉన్నారని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు బీజేపీ పార్టీనే ప్రత్యామ్నాయమని అన్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సదస్సు రవీంద్రభారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం మొత్తం నరేంద్రమోదీ హవా నడుస్తోందని, బీఆర్ఎస్ లాంటి ఎన్ని పార్టీలు వచ్చిన కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వమే వస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తన ఉనికిని చాటుకోవడానికే 4వ ఫ్రంట్ అంటూ ప్రచారం చేస్తున్నారని, దానివల్ల ఎటువంటి ప్రభావం ఉండదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగం అమలు కాక ముందు దేశంలో ఉన్న సామాజిక స్థితిగతులపై ప్రజా గాయకుడు గద్దర్ ప్రదర్శించిన నాటకం ఆకట్టుకుంది.


Next Story