తెలంగాణ లీడర్లపై బీజేపీ అధిష్టానం సీరియస్!

by Disha Web Desk 2 |
తెలంగాణ లీడర్లపై బీజేపీ అధిష్టానం సీరియస్!
X

రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికల జరగబోతున్నాయి. ఎలాగైనా అందులో విజయం సాధించి అధికారం చేపట్టాలని భావిస్తున్న బీజేపీకి.. ఆ పార్టీలోని కొందరు నేతలు చేస్తున్న కామెంట్స్ తలనొప్పిగా మారుతున్నాయి. వీరి వివాదాస్పద వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం కలుగుతున్నది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జాతీయ నాయకత్వం.. వారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. వ్యాఖ్యలను సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా సేకరిస్తున్నది. పార్టీకి డ్యామేజ్ కలిగేలా వ్యవహరిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని టీబీజేపీ నేతలకు హైకమాండ్ హెచ్చరికలు పంపినట్టు సమాచారం. మరి ఇప్పటికైనా నేతల్లో మార్పు వస్తుందా? వివాదాస్పద కామెంట్స్ చేయడం మానేస్తారా?

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎలాగైనా కాషాయ జెండా ఎగురవేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి సొంత పార్టీ నేతల వివాదాస్పద కామెంట్స్ ఇబ్బందిగా మారుతున్నాయా? చిట్ చాట్ పేరిట కొందరు నేతలు చేస్తున్న కామెంట్లతో పార్టీ భారీ నష్టాన్ని మూటగట్టుకుంటున్నదా? బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే అనేంతగా ఎదిగిన పార్టీకి.. నేతల కామెంట్స్ మైనస్‌గా మారుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోరుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. కానీ బీజేపీ‌లోని పలువురు నేతలు మాత్రం మీడియా చిట్ చాట్ పేరిట వివాదాస్పద కామెంట్స్ చేస్తుండటంతో పార్టీ ఇమేజ్ రోజురోజుకూ డౌన్ ఫాల్ అవుతున్నది.

కర్ణాటక ఎన్నికల తర్వాత టీబీజేపీలో మీడియా చిట్ చాట్ పేరిట పలువురు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. టీబీజేపీ నేతల తీరుపై అలర్ట్ అయిన జాతీయ నాయకత్వం ఈ వ్యవహారంపై దృష్టిసారించింది. చిట్ చాట్ నిర్వహించి పార్టీకి డ్యామేజ్ అయ్యేలా వ్యాఖ్యలు చేసేవారి విషయంలో సీరియస్ గా ఉన్నది. వారు చేస్తున్న కామెంట్స్ పై ఆరా తీస్తున్నది. రాష్ట్ర నాయకత్వానికి ఏమాత్రం తెలియకుండానే పూర్తి ఆధారాలతో వివరాల సేకరిస్తున్నట్టు సమాచారం. అసలు చిట్ చాట్‌లో నేతలు ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారనే విషయంపై ఆరా తీస్తున్నది. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన పలువురు బీజేపీ నేతలు పార్టీ లైన్ దాటి వ్యాఖ్యలు చేశారు.

ఇవి పార్టీకి తీవ్ర నష్టాన్ని చేకూర్చేలా ఉండటంతో శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. నేతల కామెంట్స్ కు సంబంధించి ఆయా చానళ్లకు సంబంధించిన యూట్యూబ్ లింకులు, పేపర్ క్లిప్పింగులు సైతం హైకమాండ్‌కు చేరుతున్నట్టు తెలుస్తున్నది. ఇలాంటి వారి వల్లే బీజేపీ గ్రాఫ్ క్రమంగా తగ్గుతున్నదని భావిస్తున్న హైకమాండ్.. ఇలాంటి విషయాల్లో చర్యలు తీసుకోకుంటే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దీంతో ఇకపై ఇలాంటి మీడియా చిట్ చాట్‌లకు బీజేపీ నేతలు స్వస్తి చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. నేతలెవరైనా పార్టీ లైన్ దాటి, పార్టీకి డ్యామేజ్ కలిగేలా వ్యవహరిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హైకమాండ్ సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. మరి ఇప్పటికైనా పలువురు టీబీజేపీ నేతలు తమ పద్ధతి మార్చుకుంటారా? లేదా అనేది చూడాల్సి ఉంది.

Next Story

Most Viewed