మంత్రి హరీష్ రావుకు బిగ్ షాక్.. మెదక్‌లో బీఆర్ఎస్ ఓటమి

by Disha Web Desk 19 |
మంత్రి హరీష్ రావుకు బిగ్ షాక్.. మెదక్‌లో బీఆర్ఎస్ ఓటమి
X

దిశ, వెబ్‌డెస్క్: మెదక్‌లో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. బీఆర్ఎస్ మెదక్ సిట్టింగ్ స్థానం కోల్పోయింది. మెదక్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థిని పద్మాదేవేందర్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు 9 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. కాగా, ఈ స్థానాన్ని మంత్రి హరీష్ రావు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేశారు. బీఆర్ఎస్ నుండి వెళ్లిపోయిన మైనంపల్లి హన్మంత్ రావు కొడుకు మైనంపల్లి రోహిత్‌ను ఓడించాలని ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. అయినప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం సంచలనంగా మారింది.

Next Story

Most Viewed