కాంగ్రెస్‌కు బిగ్ షాక్! టీపీసీసీ ఉపాధ్యక్షుడు రాజీనామా

by Disha Web Desk 4 |
కాంగ్రెస్‌కు బిగ్ షాక్! టీపీసీసీ ఉపాధ్యక్షుడు రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల్లో వలసలు ఊపందుకున్నాయి. తమకు ఆశించిన సీటు దక్కలేదని కొంత మంది, పార్టీలో సరైన ప్రియారిటీ దక్కడం లేదని మరి కొంత మంది పార్టీలు మారుతున్నారు. తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీ-కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. హస్తం పార్టీకి టీపీసీసీ ఉపాధ్యక్షులు జగదీష్ రావు రాజీనామా చేశారు. ముషీరాబాద్ టికెట్ ఆశించి జగదీష్ రావు భంగపడ్డారు. పారాచూట్ నేతలకు టికెట్లు ఇస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆయన ఏ పార్టీలో చేరబోయేది ఆసక్తిగా మారింది.

Next Story

Most Viewed