BRSకు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు

by Rajesh |
BRSకు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగలనుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కారు పార్టీ టికెట్లు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్, బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నారు. ఈ ఇద్దరు నేతలు నేడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. సిట్టింగ్ లతో పాటు, అసంతృప్త ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. ఎన్నికల్లో ఏ మేరకు పార్టీ మార్పు ఎఫెక్ట్ ఉంటుందో అని లెక్కలు వేసుకుంటుంది. కాంగ్రెస్ లోకి తమ పార్టీ నేతల చేరికలకు కౌంటర్‌గా కాంగ్రెస్ నేత జిట్టాను, టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డిని నేడు పార్టీలోకి చేర్చుకోనుంది.

Read More..

రూ.50 కోట్లకు పీసీసీ పదవి కొన్నాడని కోమటిరెడ్డి చెప్పారు: KTR

Next Story