రేషన్ కార్డు ఉన్నవారికి BIG అలర్ట్.. డెడ్‌లైన్ విధించిన అధికారులు

by Disha Web Desk 2 |
రేషన్ కార్డు ఉన్నవారికి BIG అలర్ట్.. డెడ్‌లైన్ విధించిన అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. వందరోజుల్లో హామీలన్నీ అమలు చేసేలా కార్యచరణ రూపొందిస్తోంది. అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లో రెండు గ్యారంటీలను అమలు చేసిన రేవంత్ సర్కార్.. మిలిగిన నాలుగు గ్యారంటీల అమలుకు ‘ప్రజాపాలన’ పేరుతో దరఖాస్తులు స్వీకరించింది. ఇదిలా ఉండగా.. రేషన్ కార్డు ఉన్నవారికి రాష్ట్ర పౌరసరఫరాల అధికారులు కీలక సూచనలు చేశారు.

రేషన్ కార్డుల ఈ-కేవైసీని జనవరి 31వ తేదీలోపు చేయించుకోవాలని అధికారులు తెలిపారు. రేషన్ కార్డు/ఆహార భద్రత కార్డులో పేరు ఉన్న ప్రతీ సభ్యుడు లేదా సభ్యురాలు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పారు. సమీప రేషన్ డీలర్ వద్ద మాత్రమే ఈ పాస్ మెషీన్ ద్వారా వేలి ముద్రలు ఇవ్వాలని చెప్పారు. అయితే ఆధార్ అప్‌డేషన్ చేసుకోని వారి ఈ-కేవైసీలు నిలిచిపోతాయని హెచ్చరించడంతో వారంతా ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.

Next Story

Most Viewed