TS: ఇంటర్మీడియట్ విద్యార్థులకు BIG అలర్ట్‌

by Disha Web Desk 2 |
TS: ఇంటర్మీడియట్ విద్యార్థులకు BIG అలర్ట్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజు గడువు తేదీలను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. నవంబర్‌ 14వ తేదీ వరకు ఫీజు గడువును నిర్ణయించింది. రూ.100 జరిమానాతో నవంబర్ 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొంది. రూ.500 ఫైన్‌తో నవంబర్ 25వ తేదీ నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు.. రూ.1000 జరిమానాతో డిసెంబర్ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఫీజు కట్టవచ్చని వెల్లడించింది. రూ.2 వేల జరిమానాతో డిసెంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందని ఇంటర్‌ బోర్డు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

మొదటి సంవత్సరం విద్యార్థులు(రెగ్యూలర్) రూ.510, ఒకేష‌న‌ల్ రెగ్యుల‌ర్ విద్యార్థులు రూ. 730, రెండో ఏడాది ఆర్ట్స్ విద్యార్థులు రూ. 510, సైన్స్, ఒకేష‌న‌ల్ విద్యార్థులు రూ. 730 చొప్పున ఫీజు చెల్లించాల‌ని వెల్లడించింది. తెలంగాణ ఇంటర్ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పరీక్షలతో పాటు సిలబస్‌కు సంబంధించి పలు మార్పులు తీసుకొచ్చిన బోర్డు.. తాజాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు నిర్వహించే ఎథిక్స్‌ అండ్‌ హ్యుమన్‌ వ్యాల్యూస్‌ పరీక్షను తొలగించాలని నిర్ణయించింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఇకపై ఒక ఇంటర్నల్ పరీక్షను మాత్రమే రాయాల్సి ఉంటుంది.

Next Story

Most Viewed