తెలంగాణా గిరిజన డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన బెల్లయ్య నాయక్

by Anjali |
తెలంగాణా గిరిజన డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన బెల్లయ్య నాయక్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణా గిరిజన డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మె‌న్‌గా నేడు బెల్లయ్య నాయక్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్.. బెల్లయ్య నాయక్‌కు శాలువ కప్పి పూలగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. గిరిజనుల అభివృద్ధికి, గిరిజన తండాల అభివృద్ధికి వారి ఉత్పత్తులను మరింత ముందుకు తీసుకుపోవాలని సూచించారు. గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గిరిజనుల అభివృద్ధికి కార్పోరేషన్ మరింత పని చేయాలని బెల్లయ్య నాయక్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు.

Next Story