Bandi Sanjay: ''మేం పోస్టర్లు వేయడం మొదలు పెడితే తట్టుకోలేరు''.. బండి వార్నింగ్

by Disha Web |
Bandi Sanjay Responds On Choutuppal Wall Posters issue
X

దిశ, వెబ్‌డెస్క్: Bandi Sanjay Responds On Choutuppal Wall Posters issue Munugode bypoll| మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయాడంటూ మునుగోడు నియోజకవర్గంలో వాల్ పోస్టర్లు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వాల్ పోస్టర్ల వ్యవహారంపై టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ సీరియస్ అయ్యారు. గతంలో టీఆర్ఎస్‌లోకి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంతకీ అమ్ముడుపోయారని ఆయన ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి స్వయంగా కాంట్రాక్టర్ అని.. డబ్బులకు అమ్ముడుపోవాల్సిన అవసరం ఆయనకు లేదని బండి పేర్కొన్నారు. పోస్టర్లు వేయడం మేం మొదలుపెడితే.. టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు తట్టుకోలేరని హెచ్చరించారు. మునుగోడులో ఈ నెల 21వ తేదీన అమిత్ షా భారీ బహిరంగ సభ ఉంటుందని.. కానీ కొందరు అమిత్ షా సభ వాయిదా అని దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ పాదయాత్రను చూసి భయపడే ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇస్తోందన్నారు.

ఇది కూడా చదవండి: మునుగోడు పాదయాత్రకు రేవంత్ రెడ్డి దూరం..




Next Story