- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ పాఠశాలల బాగు కోసం బండి సంజయ్ కీలక పిలుపు
కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక పిలుపునిచ్చారు. ఈ నెల 15 నుండి పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలను శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టబోతున్నట్టు తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను బీజేపీ నేతలు, ప్రజాప్రతినిధులు స్వయంగా శుభ్రం చేయాలన్నారు.

దిశ, వెబ్ డెస్క్: కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక పిలుపునిచ్చారు. ఈ నెల 15 నుండి పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలను శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టబోతున్నట్టు తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను బీజేపీ నేతలు, ప్రజాప్రతినిధులు స్వయంగా శుభ్రం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11న టిఫిన్ బైఠక్ కార్యక్రమంలో నిర్వహిస్తామని అన్నారు. టిఫిన్ బైఠక్ ఏర్పాటు చేసి పాఠశాలను ఎలా శుభ్రం చేయాలి అనేదానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఈ నెల 13న సచ్ఛ పాఠశాల పేరుతో శుభ్రం చేస్తామని తెలిపారు. అంతే కాకుండా ఈనెల 16వ తేదీన గ్రామాలు, పట్టణాల్లో బీజేపీ కార్యకర్తలు అంతా బడిబాట నిర్వహించి పిల్లలను స్కూలుకు పంపించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలను పనికి కాకుండా బడికి పంపించాలన్నారు. ఇదిలా ఉంటే గతంలోనూ బండి సంజయ్ ఇలాంటి కార్యక్రమాలను చేపట్టారు. పదవతరగతి పరీక్షల ముందు విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ లు పంపిణీ చేశారు.






