'తొందరగా ఎన్నికలు రావాలి.. అధికారంలోకి రాగానే అవన్నీ ఫ్రీ'

by Disha Web |
తొందరగా ఎన్నికలు రావాలి.. అధికారంలోకి రాగానే అవన్నీ ఫ్రీ
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం లూటీ చేస్తోందని తుక్కగూడ బహిరంగ సభలో బండి సంజయ్ అన్నారు. అన్ని శాఖలు తమ కుటుంబానికే కేటాయించుకుంటున్నారని, ఇటువంటి పాలన కారణంగా రాష్ట్రం మరో శ్రీలంకగా మారుతుందని, కేసీఆర్ కుటుంబం పంచభూతాలను వదలడం లేదని బండి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని, పాదయాత్రలో అనేక సమస్యలను తెలుసుకున్నామని బండి అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే భయమేస్తోందని, త్వరగా ఎన్నికలు రావాలని కోరుకుంటున్నాని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.

కల్వకుంట్ల కుటుంబ పాలనలో ప్రజలను కాపాడటం కోసమే ప్రజా సంగ్రామ యాత్ర చేశాం. ప్రాజెక్టుల పేరుతో హామీలు ఇచ్చి రైతాంగాన్ని నానా కష్టాలు పెడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్ పాలన తుగ్లక్ రాజు పరిపాలనను గుర్తు చేస్తోంది. తన తుగ్లక్ నిర్ణయాలను తెలంగాణ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిలువు నీడలేని ప్రజలు కేసీఆర్ పాలనలో పెరిగిపోయారు. వీరందరికీ బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 'పీఎం అవాస్ యోజన్' పథకం కింద సొంత ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా వ్యాట్ తగ్గించి పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాటితో పాటుగా ఉచిత విద్య, వైద్యాన్ని కూడా రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story