- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
కేటీఆర్, ప్రకాశ్‌రాజ్‌పై బండి సంజయ్ ఫైర్

దిశ, డైనమిక్ బ్యూరో : సినీనటుడు ప్రకాశ్‌రాజ్ దత్తత తీసుకున్న రంగారెడ్డిజిల్లా, కొండారెడ్డిపల్లిని అద్భుతంగా అభివృద్ధి చేశారని అభినందిస్తూ ఆ గ్రామానికి చెందిన ఫోటోలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్న విషయం తెలిసిందే. దీంతో, పనిచేసింది మేమైతే, ప్రశంసించేది ప్రకాశ్‌రాజ్‌నా అంటూ కేటీఆర్‌పై కొండారెడ్డిపల్లి గ్రామస్తులు, సర్పంచ్ స్వాతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశ్ రాజ్ కేవలం 2019 వరకే దత్తత తీసుకున్నారని, ఆయన చేసిన అభివృద్ధి కంటే తామే సొంత నిధులతో చేసిన అభివృద్ధి ఎక్కువ ఉందని సర్పంచ్ స్వాతీ మండిపడ్డారు. ఈ విషయంపై బీజేపీ స్టేట్ ఛీఫ్ బండిసంజయ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మహిళా సర్పంచ్ స్వాతి సొంత నిధులతో కొండారెడ్డిపల్లి గ్రామాభివృద్ధికి కృషి చేశారని బండి సంజయ్ అభినందించారు. కానీ, ట్విట్టర్ టిల్లు, ప్రకాశ్‌రాజ్ ( మంత్రి కేటీఆర్) సిగ్గులేకుండా క్రెడిట్ తీసుకుని, కష్టపడి పనిచేసే మహిళ చేసిన పనిని తమదిగా భావించి తప్పుదారి పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఎదుటి వారి కష్టాన్ని తమదిగా మలుచుకోవడం అవమానం ! అంటూ బండి సంజయ్ ఆరోపించారు.