ఆ రోజే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల శంఖారావం: బండి సంజయ్

by Disha Web Desk 2 |
ఆ రోజే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల శంఖారావం: బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 28వ తేదీన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పూరిస్తారని అన్నారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రజలకు చాలా క్లియర్‌గా వివరిస్తామని ప్రకటించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఫిబ్రవరి 5 నుంచి యాత్ర ఉంటుందని తెలిపారు. దాదాపు 20 రోజుల పాటు యాత్ర చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టినా బీఆర్ఎస్ నేతలకు అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల చేత మరోసారి బీఆర్ఎస్ నేతలు ఘోర పరాజయం చవిచూస్తారని అన్నారు.

రాష్ట్రంలో ఇకనుంచి బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం కాబోతోందని జోస్యం చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదలకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఆరోజున మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ఆయన.. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్ బయలేరుతారు. మధ్యాహ్నం ఒంటి గంట 50 నిమిషాల నుంచి 2 గంటల 40 నిమిషాల వరకు మహబూబ్‌నగర్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి కరీంనగర్ వెళ్తారు. అక్కడ బీజేపీ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు.

Next Story

Most Viewed