మహిళలపై అత్యాచారాలను నిరసిస్తూ బండి సంజయ్ దీక్ష

by Disha Web Desk |
మహిళలపై అత్యాచారాలను నిరసిస్తూ బండి సంజయ్ దీక్ష
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు, మహిళలపై అత్యాచారాల ఘటనలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు దిగబోతున్నారు. మార్చి 6వ తేదీన బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి బండి సంజయ్ దీక్ష చేయనున్నారు. ఈ దీక్షకు సంబంధించి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా బీఆర్ఎస్ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది.

ఇటీవల మహిళా మోర్చ సమావేశంలో ఇదే విషయాన్ని బండి సంజయ్ ప్రస్తావించారు. మహిళలకు రక్షణ కల్పిచడంలో కేసీఆర్ విఫలం అయ్యారని అదే తాము అధికారంలోకి వస్తే మహిళలపై అత్యాచారాలు చేసే లుచ్చాగాళ్ల అంతుచూస్తామని హెచ్చరించారు. అంతే కాదు యూపీ తరహాలో బుల్డోజర్లతో నిందితుల ఇళ్లు కూల్చేస్తామని అన్నారు. మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతుంటే ముఖ్యమంత్రి, హోం మంత్రి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

ఇవి కూడా చదవండి: నిజాం సమాధి వద్ద మోకరిల్లే పార్టీలకు బుద్ధి చెప్పాలే: బండి సంజయ్ ఫైర్

Next Story

Most Viewed