కేసీఆర్ కొత్త పార్టీపై బండి సంజయ్ సెటైర్లు

by Disha Web |
కేసీఆర్ కొత్త పార్టీపై బండి సంజయ్ సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీపై తెలగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సెటైర్లు వేశారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడం అంటే పందికి లిప్ స్టిక్ పెట్టడం లాంటిదని ఎద్దేవా చేశారు. బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించిన బండి సంజయ్.. కేటీఆర్ ను ఉద్దేశించి ట్విట్టర్ టిల్లు అంటూ సెటైర్లు వేశారు. ట్విట్టర్ టిల్లు తన తండ్రి గేమ్ ఛేంజర్స్ అని క్లెయిమ్ చేశాడని కాని అతని తండ్రి గేమ్ ఛేంజర్ కాదని నేమ్ ఛేంజర్ అంటూ విమర్శించారు. ప్రజలే అంతిమంగా ఫేట్ ఛేంజర్స్ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు కేసీఆర్ ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి ప్రకటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుని కాలం గడిపిన కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో మరోసారి ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నాడని ప్రజలు పదే పదే మోసం పోవడం జరగదని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ కు బీఆర్ఎస్ తో నిరాశ తప్పదని జోస్యం చెబుతున్నారు.

Next Story

Most Viewed