బండి సంజయ్ అరెస్ట్ : బొమ్మల రామారం పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

by Disha Web Desk 4 |
బండి సంజయ్ అరెస్ట్ : బొమ్మల రామారం పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, వెబ్‌డెస్క్: బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో బొమ్మల రామారం పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ కు 41 సీఆర్ పీసీ నోటీసులు ఇచ్చి పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. బండి సంజయ్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు తెలిసింది.

బొమ్మల రామారం పీఎస్ వద్ద బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ తర్వాత బండి సంజయ్‌ను ఎక్కడికి తరలిస్తారన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. పోలీస్ స్టేషన్ లోనికి చొచ్చుకెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులకు, బీజేపీ నాయకులకు తోపులాట జరిగింది. పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు బొమ్మల రామారం పీఎస్‌కు వస్తుండటంతో హై టెన్షన్ నెలకొంది.

Next Story

Most Viewed