గురుకుల, ఏఈఈ అభ్యర్థులకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కీలక హామీ

by Ramesh N |
గురుకుల, ఏఈఈ అభ్యర్థులకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కీలక హామీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రల పనితీరుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బీఆర్ఎస్‌పై మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలోనే బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్ క్రిషాంక్ ఓయూ ఫేక్ జీవో సృష్టించారని గుర్తుచేశారు. జీవోపై చర్చకు సిద్ధమని బహిరంగ సవాల్ విసిరితే స్పందించ లేదన్నారు. అలాగే టీఎస్ టు టీజీ లోగో మార్చడం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు కోసం కాంగ్రెస్ పార్టీ వేల కోట్ల రూపాయలు వృధా చేస్తుందని బీఆర్ఎస్ ఫేక్ కాపీని క్రియేట్ చేశారని వెల్లడించారు. ముఖ్యమంత్రిని బ్యాడ్ చేసి చూపించడం కోసం ఫేక్ క్రియేట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్‌ సర్కార్‌పై ఆరోపణలు కాదు, ఆధారాలు చూపిస్తే క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధమని సవాల్ చేశారు. లేదంటే సీఎం రేవంత్‌కి, తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పింక్ మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. సీఎంపై చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెప్పడానికి తాను సిద్ధమన్నారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేస్తున్న ప్రచారం అబద్దమైతే ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. వీరు ప్రభుత్వంపై పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టి తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. మరోవైపు తప్పుడు పత్రాలు సృష్టించి బీఆర్ఎస్ అఫీషియల్ అకౌంట్స్ లలో పెట్టి నిజమని నమ్మిస్తున్నారని, ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించండి. తప్పుడు ప్రచారాలు చేయకండని సూచించారు.

పదిహేను రోజుల్లో మీ సమస్య పరిష్కరిస్తాం

గురుకుల, ఏఈఈ అభ్యర్థులు ఆందోళన పడకండని చెప్పారు. కొందరు రాజకీయ లబ్ధి కోసం విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా తన దగ్గరికి వస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తాని హామీ ఇచ్చారు. పదిహేను రోజుల్లో మీ సమస్య పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఒక్కొక్కటి సరి చేస్తున్నామని, ఒక్క ఇబ్బంది కలగకుండా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించామని గుర్తుచేశారు. నీట్‌పై హైదారాబాద్ వేదికగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టంచేశారు.



Next Story

Most Viewed