ఆయుష్ వైద్యుల సమస్యలు పరిష్కరించేందుకు స్పెషల్ ప్లాన్

by Disha Web Desk 4 |
ఆయుష్ వైద్యుల సమస్యలు పరిష్కరించేందుకు స్పెషల్ ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఉన్న ఆయుష్ వైద్యుల సమస్యలను పరిష్కరిస్తామని టి ఎస్ ఎం ఎస్ ఐడీసీ చైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు స్పెషల్ ప్లాన్ తయారు చేస్తున్నామని చెప్పారు. నేషనల్ ఇంటి గ్రేటేడ్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆయుర్వేద, అల్లోపతీ, నేచురోపతి లాంటి వాటికి ప్రభుత్వం అనేక రకాలుగా ప్రోత్సాహం ఇస్తుందన్నారు. వైద్య శాఖకు గత బడ్జెట్ లో ఆరు వేల కోట్లు కేటాయిస్తే.. మొన్నటి బడ్జెట్ లో 11,500 వందల కోట్లు కేటాయించామన్నారు. ఆయుష్ డిపార్ట్మెంట్ లో ఉన్న సమస్యలతో పాటు ఆయుర్వేద ,యునాని , హోమియోపతికి సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో దీన్ని మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు

సర్కార్ దవాఖానాల్లో సాధ్యమైనంత మేరకు మౌలిక సదుపాయాలు, వసతులు కల్పిస్తున్నామన్నారు. గతంలో ఉన్నప్పటి కంటే ప్రస్తుతం తెలంగాణలో వైద్య ఆరోగ్య విషయంలో ప్రజలకు సరైన విధంగా ఇన్ఫ్రస్ట్రక్చర్ అందిస్తున్నామన్నారు. విద్య వైద్యం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు.ప్రో జ్యోత్స్న మాట్లాడుతూ.. ఆయుష్ డాక్టర్ల రిజిస్ట్రేషన్ ల కోసం ప్రభుత్వం సమయం ఇవ్వాలన్నారు. ఆరోగ్యవంతమైనాసమాజం కోసం ఆయుష్ పరిధిలోని డాక్టర్లు అంత సేవలు చేస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వం నుండి మరింత సహకారం అందిస్తే సేవలను విస్తృత పరచడానికి అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు .


Next Story

Most Viewed