ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడికి యత్నం.. యువకుడి ఇంటిపై కుటుంబసభ్యుల దాడి

by Rajesh |
ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడికి యత్నం.. యువకుడి ఇంటిపై కుటుంబసభ్యుల దాడి
X

దిశ, నిజామాబాద్ సిటీ : ఆరు సంవత్సరాల బాలికపై ఒక కామాంధుడు అఘాయిత్యానికి యత్నించాడు. బాలిక పినతల్లి చూడడంతో బాలికను వదిలి పరారీ అయ్యాడు. విషయం తెలిసిన బాలిక కుటుంబ సభ్యులు స్థానికులు చిన్నారిపై లైంగికదాడికి యత్నించిన యువకుడి ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మోపాల్ మండలంలోని ఓ గ్రామపంచాయతీలో నివసించే ఆరు సంవత్సరాల బాలికపై పక్కింట్లో ఉండే యువకుడు చాక్లెట్ ఆశగా చూపి తన ఇంట్లోకి తీసుకుపోయాడు.

అనంతరం లైంగిక దాడికి యత్నించాడు. బాలికను ఒంటరిగా తన ఇంట్లోకి తీసుకువెళ్తున్నప్పుడు చూసిన బాలిక చిన్నమ్మ అక్కడికి చేరుకొని కేకలు వేయడంతో యువకుడు పరారయ్యాడు. విషయం తెలిసిన బాలిక కుటుంబ సభ్యులు బంధువులు ఇంటిని ధ్వంసం చేశారు. అనంతరం మోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి గ్రామంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story

Most Viewed