సీఎం కనుసన్నల్లోనే బీఆర్ఎస్ నేతలపై దాడి : అడిషనల్ డీజీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు

by M.Rajitha |
సీఎం కనుసన్నల్లోనే బీఆర్ఎస్ నేతలపై దాడి : అడిషనల్ డీజీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో : భవిష్యత్ లో ఖమ్మంలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. బుధవారం అడిషనల్ డీజీ మహేష్ భగవత్ కు మొమోరండం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్, మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లో ఖమ్మంలో తమపై దాడి జరిగిందన్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందనడానికి బీఆర్ఎస్ నేతల పై జరిగిన దాడులే నిదర్శనం అన్నారు. వరద బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుండటాన్ని సీఎం ఓర్చుకోలేకే దాడులకు రౌడీ షీటర్ల ను పురమాయించారని ఆరోపించారు. ఈ దాడిని సీఎం కార్యాలయం పర్యవేక్షించిందన్నారు. దాడిలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలకు పోలీసులు అండగా నిలిచారన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడ్డ వారి వివరాలు పోలీసులకు అందజేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని, వెంటనే కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయాలని కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించేలా వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.



Next Story

Most Viewed