- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ముస్తాబు గురించి మీ లిక్కర్ చెల్లిని అడగండి.. కాంగ్రెస్ నేత ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఒకరిపై మరొకరు విమర్శలకు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే అచ్చంపేటలో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శలకు ఏఐసీసీ కార్యదర్శి ఎస్.ఏ.సంపత్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి సీఎం అని కాంగ్రెస్ ముందే ప్రకటించి ఉంటే 30 సీట్లు రాకపోయి ఉండేవని కేటీఆర్ అంటున్నారని, కేటీఆర్ ఓటమిని జీర్ణించుకోలేక రాజకీయ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి సీఎం అని ముందే ప్రకటించినట్లయితే 100 సీట్లు దాటేవని, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు కూడా సీట్లు కోల్పోయేవారని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం రేవంత్ రెడ్డికి నచ్చడలేదని కేటీఆర్ అంటున్నారని, మీరు మీ ఇంట్లో తయారు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు లేవని తెలంగాణ ఉద్యమకారులు, విద్యావంతులే అన్నది గుర్తుచేసుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులు నగలు వేసుకోవచ్చు కాని తెలంగాణ తల్లికి ఉండోద్దా అంటున్నారని, ఎవరూ ఎంతగా ముస్తాబు అవుతారో మీ లిక్కర్ చెల్లిని అడగాలని కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ గీతం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారని, అధికారంలో ఉన్న పదేళ్లు గడ్డి పీకావా అంటూ.. అందెశ్రీ దళితుడు అనే కారణంతోనే జయ జయహే తెలంగాణ పాటని తెలంగాణ గీతంగా మార్చలేదని తీవ్ర విమర్శలు చేశారు. ఓడిపోయిన నైరాశ్యంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే ముందు నీ స్థాయి ఏంటో తెలుసుకోవాలని, నీ భాష, పదజాలం మార్చుకొని సోయిలోకి వచ్చి మాట్లాడాలని మాస్ వార్నింగ్ ఇచ్చారు.