చంద్రబాబు అరెస్ట్‌పై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
చంద్రబాబు అరెస్ట్‌పై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టయిన విషయం తెలిసిందే. ఇక ఇదే అంశంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చంద్రుడు హ్యాపీగా జైల్లో ఉన్నారన్నారు. ఆయన ఎందుకు జైలుకెళ్లారో అందరికీ తెలుసన్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీ రెండే పార్టీలు ఉన్నాయన్నారు. ఏపీలో సీఎం జగన్ పాలన బాగుందని ఒవైసీ కితాబిచ్చారు. చంద్రబాబును నమ్మలేమని.. ప్రజలు కూడా నమ్మొద్దని సూచించారు. ఏపీలో కూడా పోటీ చేసే యోచనలో ఉన్నామన్నారు.

ఎంఐఎం నేతలను వేధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అసదుద్దీన్ ఓవైసీ వార్నింగ్ ఇచ్చారు. ఇబ్బంది పెట్టిన వారిని గుర్తుపెట్టుకుంటామన్నారు. మాతో స్నేహంగా ఉంటే సహకరిస్తాం.. ఫ్రెండ్ షిప్ పేరుతో వెన్నుపోటు పొడిస్తే ఒప్పుకోమన్నారు. మాతోనే మీకు అవసరం.. మీ అవసరం మాకు లేదన్నారు. తమకు పదవులపై ఆశలేదన్నారు.

Next Story