ఛత్రపతి శివాజీపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు (వీడియో)

by Disha Web Desk 4 |
ఛత్రపతి శివాజీపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్రపతి శివాజీ జయంతి వేళ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మరాఠా సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ఓవైసీ మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ ఇస్లాంను వ్యతిరేకించలేదన్నారు. పేదల పక్షాన ఛత్రపతి శివాజీ పోరాటం చేశారన్నారు. ఛత్రపతి శివాజీ ముస్లింలను వ్యతిరేకించారని ఆర్ఎస్‌ఎస్ వాళ్లు ఇంకెన్ని రోజులు అబద్ధాలు చెబుతారన్నారు. ఛత్రపతి శివాజీ వద్ద 13 మంది ముస్లిం జనరల్‌లు ఉండేవారన్నారు.

ఛత్రపతి వద్ద లా మినిస్టర్‌గా ముస్లిం వ్యక్తి పని చేశారని.. ఛత్రపతి ఓ సూఫీ వద్దకు తరచూ వెళ్లేవారన్నారు. ఛత్రపతి కేవలం మొగల్ సామ్రాజ్యాధినేతలకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. కానీ ఏనాడూ ముస్లింలను, ఇస్లాంను వ్యతిరేకించలేదన్నారు. శివాజీ కేవలం పేదల పక్షాన మాత్రమే పోరాటం సాగించారన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్లే ఛత్రపతి శివాజీ ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేశారని ప్రచారం చేస్తున్నారన్నారు. ఆగ్రా నుంచి ముస్లింలతో కలిసే ఛత్రపతి పారిపోయారన్నారు. అఫ్జల్ ఖాన్‌ను ఛత్రపతి శివాజీ చంపినప్పుడు కూడా ఆయన బాడీగార్డులుగా ముస్లింలే ఉన్నారన్నారు. కాగా ఛత్రపతి శివాజీపై అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Next Story