ఉత్తమ ఏఈఆర్‌వోగా ఆర్మూర్ తహసీల్దార్ ఎంపిక

by Disha Web Desk 4 |
ఉత్తమ ఏఈఆర్‌వోగా ఆర్మూర్ తహసీల్దార్ ఎంపిక
X

దిశ ఆర్మూర్ : రాష్ట్రస్థాయిలో ఉత్తమ సహాయ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఏఈఆర్‌వో) తహసీల్దార్‌గా ఆర్మూర్ తహసీల్దార్ బి.వేణుగోపాల్ గౌడ్ మంగళవారం ఎంపికయ్యారు. బుధవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి ఆర్మూర్ తహసీల్దార్ వేణుగోపాల్ గౌడ్ ప్రశంసా పత్రం, అవార్డ్‌లను అందుకొనున్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణానికి, మండలానికి చెందిన పలువురు ప్రముఖులు తహసీల్దార్ వేణుగోపాల్ గౌడ్‌కు అభినందనలు తెలిపారు.

Next Story