పెళ్లి చేసుకుంటున్నారా.. అయితే ఈ బంపర్ ఆఫర్ మీకోసమే

by M.Rajitha |
పెళ్లి చేసుకుంటున్నారా.. అయితే ఈ బంపర్ ఆఫర్ మీకోసమే
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రావణమాసం పెళ్ళిళ్ళ సీజన్లో ఆర్టీసీ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. శ్రావణమాసంలో జరగబోయే పెళ్లిళ్లను, శుభకార్యాలకు ఆర్టీసీ బస్ బుక్ చేసుకుంటే భారీ రాయితీలు ఇస్తామని ప్రకటించారు. అయితే ఇది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ వాసులకు మాత్రమే. ఇందుకు సంబంధించి ఆర్మూర్ డిపో మేనేజర్ రవికుమార్ కీలక ప్రకటన జారీ చేశారు. ఈ నెలలో జరగబోయే అన్ని రకాల శుభకార్యాలకు ఆర్టీసీ బస్ బుక్ చేసుకుంటే ఎలాంటి డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాకుండా 10% ప్రత్యేక రాయితీ ఇస్తున్నామని తెలిపారు. వర్షంలో ఇబ్బందులు పడకుండా, ఆర్టీసీ బస్సుల్లో సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చునని, ప్రైవేట్ వాహనాల కంటే ఇవి ఎంతో సురక్షితం అన్నారు. అప్పటికప్పుడు ట్రాలీలు, ఆటోల్లో ప్రయాణించి ఇబ్బందులు పడకుండా ముందస్తుగా ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకోవాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed