ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల బెయిల్ పిటిషన్లపై ముగిసిన వాదనలు.. కోర్టు నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ

by Satheesh |
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల బెయిల్ పిటిషన్లపై ముగిసిన వాదనలు.. కోర్టు నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన సస్పెండెడ్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్లపై తీర్పును బుధవారం వెల్లడిస్తామని పేర్కొంది. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యే ప్రస్తుతం జైలులో ఉన్న భుజంగ రావు తిరుపతన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్లపై నాంపల్లి కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశలో ఉన్నదని.. ఈ సమయంలో నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే భజంగరావు, తిరుపతన్నలపై పోలీసులు కేసు నమోదు చేశారని వీరి తరుఫు లాయర్లు వాదించారు. ఇరు వర్గాల వాదనలు పూర్తి కావడంతో బెయిల్ పిటిషన్లపై తీర్పును నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది. దీంతో నిందితులకు బెయిల్ వస్తుందా..? రాదా..? అని కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Next Story