ప్రపంచ స్థాయి పక్కన పెడితే.. దీనికి ఎవరు బాధ్యత?.. కేటీఆర్

by Ramesh Goud |
ప్రపంచ స్థాయి పక్కన పెడితే.. దీనికి ఎవరు బాధ్యత?..  కేటీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కరెంట్ కోతలు, రైతుల ఇబ్బందులే ప్రధాన అస్త్రాలుగా మలుచుకున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తోంది. కరెంట్ కోతలు లేవని సీఎం, ఆయన మంత్రులు పదే పదే చెబుతున్నారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఎంజీఎం ఆసుపత్రిలో 5 గంటల పాటు కరెంటు లేకపోవడంతో రోగుల ఇబ్బందులపై స్పందించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.

ఎంజీఎంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో వార్డులో కరెంట్ లేక సెలైన్ తో సహా వరండాలో మహిళా రోగి అని ఓ వార్త పత్రిక ముద్రించిన కథనాన్ని ట్విట్టర్ ద్వారా కేటీఆర్ పోస్ట్ చేశారు. ఎంజీఎం ఆసుపత్రిలో 5 గంటల నాటు విద్యుత్ కోత ఏర్పడటం బాధకరం అని, ఈ ఘటన నవజాత శిశువుల నుండి వృద్ద రోగుల వరకు వారి ప్రాణాలకే ముప్పు అని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచ స్థాయి మౌళిక సదుపాయాలు ఉన్న ఆసుపత్రులను నిర్మించడం పక్కన పెడితే, ఉన్న ఆసుపత్రులను కూడా నిర్వహించలేకపోతోంది అని ఆరోపించారు. అంతేగాక కరెంట్ కోతలు లేవని సీఎం, ఆయన మంత్రులు పదే పదే చెబుతున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు.

Next Story

Most Viewed