కేసీఆర్‌కు గాయం.. కేటీఆర్‌కు ఏపీ సీఎం జగన్ ఫోన్

by Disha Web Desk 19 |
కేసీఆర్‌కు గాయం.. కేటీఆర్‌కు ఏపీ సీఎం జగన్ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏపీ సీఎం జగన్ ఫోన్ చేశారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందని కేటీఆర్‌ను అడిగి తెలుసుకున్నారు. కాగా, గురువారం రాత్రి ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో కేసీఆర్ కాలు జారి పడటంతో ఆయన తుంటి ఎముక ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో ఆయనను సోమాజిగూడ యశోదా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు కేసీఆర్‌కు హిప్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జరీ చేస్తు్న్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్, కవిత, హరీష్ రావు యశోదా ఆసుపత్రికి చేరుకున్నారు.Next Story