నర్సులకు మరో చిక్కు.. సీనియర్లకు నష్టం జరుగుతుందని ఆవేదన!

by Disha Web Desk 2 |
నర్సులకు మరో చిక్కు.. సీనియర్లకు నష్టం జరుగుతుందని ఆవేదన!
X

దిశ, తెలంగాణ బ్యూరో: నర్సులకు మరో చిక్కు వచ్చింది. ఇటీవల విడుదల చేసిన 5,204 మంది భర్తీలో అకడమిక్ వెయిటేజీ క్లోజ్ చేశారు. ఫస్ట్ టైమ్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతో తాము నష్టపోతున్నామని సీనియర్ నర్సులు చెబుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు, ఇతర మెడికల్ సంస్థల్లో పనిచేసే వాళ్లే ఎక్కువగా నష్టపోతున్నామని ఓ నర్సు చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వానికి రిక్వెస్ట్​చేసినా, స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలకు నష్టం జరిగే అవకాశం ఉన్నదని పేర్కొంటున్నారు.

ఏమిటీ ఈ మార్కులు..? నష్టం ఎవరికి..?

మెడికల్​అండ్​హెల్త్ సర్వీసెస్​రిక్రూట్​ మెంట్ బోర్డు ద్వారా 5204 నర్సుల పోస్టుల భర్తీ ప్రాసెస్​జరుగుతున్నది. జేఎన్​టీయూ ఆధ్వర్యంలో మార్చి, ఏప్రిల్​ నెలల్లో ఎగ్జామ్​నిర్వహించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. 80 మార్కులకు ఉండే ఈ పరీక్ష కొరకు హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌లలో సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. అయితే అకడమిక్​వెయిటేజీ లేదని అధికారులు చెబుతున్నారు. అంటే నర్సింగ్​ విద్య పూర్తైన తర్వాత ఏడాదికి ఒక మార్కు చొప్పున ఇప్పటి వరకు పరిగణలోకి తీసుకుంటూ గరిష్టంగా పది మార్కులు గతంలో ఇచ్చారు. ఈ రూల్​ ఇప్పుడు ఎత్తేశారు. ప్రస్తుతం కేవలం ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసే కాంట్రాక్ట్, అవుట్​సోర్సింగ్​వాళ్లకు సర్వీస్​ కోటా కింద వెయిటేజ్​ఇవ్వనున్నారు.

దీని వలన ప్రైవేట్​ ఆసుపత్రులలో పనిచేసే నర్సులకు రెగ్యులర్​భర్తీలో ఎక్కువ నష్టం జరిగే ఛాన్స్​ ఉన్నదని నర్సింగ్​ యూనియన్లు చెబుతున్నాయి.టీఎస్​పీఎస్సీ గతంలో 1800 పోస్టుల భర్తీ సమయంలో రెండు విధానాలుగా వెయిటేజీ ఇచ్చినట్లు నర్సులు పేర్కొంటున్నారు. అకడమిక్​ తో పాటు కాంట్రాక్ట్​పద్ధతిలో పనిచేస్తున్న నర్సులకు వెయిటేజీ కలిపారు. కానీ ఇప్పుడు ఈ రూల్ తొలగించడంపై తమకు అన్యాయం జరుగుతుందని సీనియర్​నర్సులు స్పష్టం చేస్తున్నారు. పైగా రాత పరీక్షల్లో రీసెంట్​గా నర్సింగ్​ కోర్సు పూర్తి చేసినోళ్లతో పోటీ పడలేమని సీనియర్​నర్సులు చెబుతున్నారు. ఇలాంటి వారికి అకడమిక్​ ఇయర్​ఆధారంగా వెయిటేజీ ఇస్తే కాస్త మేలు జరుగుతుందని నర్సింగ్ సమితి ప్రెసిడెంట్​ గోవర్ధన్​ తెలిపారు. ప్రభుత్వం ప్రతి ఏడాది నోటిఫికేషన్లు ఇచ్చి ఉంటే అకడమిక్​ఇయర్​వెయిటేజ్​అవసరం రాదని చెప్పారు.

రెండు వెయిటేజీలు కష్టం..

వెయిటేజీ అంశంపై ఇప్పటికే మంత్రి హరీష్​రావుతో పాటు మెడికల్​ బోర్డు సెక్రటరీ కూడా నర్సులు రిక్వెస్ట్​ చేశారు. కానీ రెండు రకాల వెయిటేజీలు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం లేదు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రులలో కాంట్రాక్ట్, అవుట్​ సోర్సింగ్ లో పనిచేసే స్టాఫ్​కు గరిష్టంగా 20 వెయిటేజీ మార్కులు ఇస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిజేసే వారికి ప్రతీ ఆరు నెలలకు 2.5 మార్కులు, ఇతర ప్రాంతాలలో పనిచేస్తే రెండు మార్కులు చొప్పున పరిగణలోకి తీసుకుంటారు.



Next Story

Most Viewed