తెలంగాణలో మరో జర్నలిస్ట్ సంఘం ఆవిర్భావం

by Disha Web Desk 19 |
తెలంగాణలో మరో జర్నలిస్ట్ సంఘం ఆవిర్భావం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మరో జర్నలిస్టు సంఘం ఆవిర్భవించింది. హైదరాబాద్‌లోని నాంపల్లి టీఎన్జీఓస్ భవన్‌లో ఆదివారం రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల జర్నలిస్టు ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీనియర్ జర్నలిస్ట్ కొండల్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జర్నలిస్టు యూనియన్ ఆఫ్ స్టేట్ తెలంగాణ(జేయూఎస్టీ) ఏర్పడింది. సంఘం కన్వీనర్‌గా ఎంవీ రమణ, కో కన్వీనర్లుగా పీవీ శ్రీనివాస్, జమాల్పూర్ గణేష్, బిజిగిరి శ్రీనివాస్, శశికాంత్, మల్లీశ్వరి, నాంపల్లి మురళి, గుంటిపల్లి వెంకట్, సలహాదారుగా కొండల్ రావు ఎన్నికయ్యారు.

అదే విధంగా స్టేట్ అడ్హాక్ కమిటీ సభ్యులుగా కొండల్ గౌడ్(హైదరాబాద్), గోపాలకృష్ణ(కరీంనగర్), డి.నర్సింహచారి(నిజామాబాద్), లక్ష్మీనారాయణ(రంగారెడ్డి), బస్వరాజు(మహబూబ్నగర్), యోగనంద్ రెడ్డి(మెదక్), క్రాంతి(నల్గొండ), రాజేష్(ఆదిలాబాద్) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కన్వీనర్ రమణ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల సాధనే లక్ష్యంగా పని చేస్తూనే ప్రజల గొంతుకగా నిలుస్తామన్నారు. ఏ రాజకీయ పార్టీ పట్ల అనుకూలంగానో, వ్యతిరేకంగా గానో వ్యవహరించమని, ఫక్తు జర్నలిస్టుల ప్రయోజనాలే పరమావిధిగా పనిచేస్తామని వెల్లడించారు.


Next Story

Most Viewed