హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం..

by Disha Web Desk 12 |
హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం..
X

దిశ, ముషీరాబాద్ : బాగ్లింగంపల్లిలో ఓ డెకరేషన్ గోదాంలో గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. విఎస్‌టి చౌరస్తా వద్ద ఉన్న ఓ గోదాంలో శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్ సామగ్రిని నిర్వాహకులు భద్ర పరుస్తున్నారు. ఇదిలా ఉండగా గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో గోదాం నుంచి అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. ఆజమాబాద్ పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకుంది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ తెప్పించి మంటలను ఆర్పి వేస్తున్నారు. గోదాంలో అంత డెకరేషన్ సామాగ్రి ఉండటంతో మంటలు ఎగిసి పడుతున్నాయి. మంటలను ఆర్పడానికి సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. ఈ గోదాం పక్కనే ఓ కార్ కంపెనీకి చెందిన సర్వీస్ సెంటర్ ఉంది. మంటలు కార్ సర్వీస్ సెంటర్ వెళ్ళలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు.



Next Story

Most Viewed